ఈనెల 24న అఖిలభారత సమ్మెకు సిద్ధం కండి

0 8,461

-ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాములు

కోరుట్ల  ముచ్చట్లు:

- Advertisement -

స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24 న అఖిలభారత సమ్మెకు సిద్ధం కావాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాములు పిలుపు నిచ్చారు. గురువారం కోరుట్ల పట్టణంలోని సి ప్రభాకర్ భవన్ లో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ నెల 24 న అఖిలభారత జయప్రదం చేయడానికి కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడి ,ఆశ మధ్యాహ్న భోజనం ఐకెపి, విఓఏ, కస్తూరి బా, చైల్డ్ లేబర్ ,మెడికల్ అండ్ హెల్త్ ,మోడల్ స్కూల్ తదితర స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కనీస వేతనం 21 వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కీమ్ వర్కర్ ను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. ఈ కార్మిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ కనీస పెన్షన్, పని భద్రత కల్పించకుండా చట్టప్రకారం కనీస వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడికి పాల్పడుతూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏఐటి యుసి, సిఐటియు, ఐఎఫ్టియు నాయకులు ఎండి ముఖం, తిరుపతి నాయక్, చింత భూమేశ్వర్ ,గంగాధర్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Get ready for the All India Strike on the 24th of this month

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page