హైదరాబాద్ లో మరో ఘటన

0 8,769

హైదరాబాద్  ముచ్చట్లు:

సైదాబాద్ సింగరేణి చైత్ర ఘటన మరువక ముందే మరో ఘటన మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలో  చోటుచేసుకుంది. ఏడేళ్ల  చిన్నారి  ని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి  ప్రయత్నించగా చిన్నారి అరుపులతో నిందితుడు పారిపోతుండగా స్థానికులు పట్టుకుని మంగళహట్ పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి.  మల్లేపల్లి మాంగర్ బస్తీకి చెందిన ప్రతాప్ మెరు, పద్మ దంపతులు వీరికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కాగా అందులో అర్చన ఏడు సంవత్సరాలు పెద్ద కూతురు కాగా బుధవారం అర్ధరాత్రి మాంగర్ బస్తికి చెందిన బస్తీవాసులు వినాయక నిమజ్జన చేయడానికి బస్తీవాసులు ట్యాంక్ బండ్ కి వెళ్లిపోయారు. రాత్రి అవుతున్నా తన తల్లితండ్రులు  ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన చిన్నారి అర్చన బయటికి వచ్చి వెతుకుతుండగా అదే ప్రాంతానికి చెందిన సుమిత్ 17 సంవత్సరాలు అర్చనను గుర్తించి ఇంత రాత్రి బయటకి ఎందుకు వచ్చావు అంటూ అడిగి ఇంటికి తీసుకెళ్తాను అంటూ  మాయమాటలు చెప్పి చీకట్లో అర్చన పైన అత్యాచార యత్నానికి ప్రయత్నిస్తుండగా ఆమె అరుపులతో భయపడిన నిందితుడు అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Another incident in Hyderabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page