నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకం

0 8,463

-సింగరేణి సహకారంతో మెట్ పెల్లిలో 32 సిసి కెమెరాలు ప్రారంభం

కోరుట్ల ముచ్చట్లు:

- Advertisement -

ప్రస్తుత రోజుల్లో నేరాలను నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడంలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్పీ సింధు శర్మ   తెలిపారు.గురువారం మెట్ పెల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ సింగరేణి  వారి సహకారంతో ఈరోజు పట్టణాలో సుమారు 15 లక్షల విలువగల 32 సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు.  సిసి కెమెరాల ఎర్పాటు చేసి నేరాల నియంత్రణలో పరోక్షంగా  భాగ స్వాములైన సింగరేణి సి.ఎం.డి శ్రీధర్ కి ఈ సందర్భంగా ఎస్పీ కృతజ్ఞతాలు తెలిపారు.ఈ సీసీ కెమెరాలను మెట్ పెల్లి పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయడం జరిగిందని, ప్రస్తుత రోజుల్లో ఎలాంటి నేరాలను జరిగిన వాటిలోని నేరస్తులను కనుగోనడంలో సిసి కెమెరాలు పోలీసులకు ఒక అయుధంగా నిలుస్తోందిఅన్నారు. సిసి కెమెరాల ద్వారా సేకరించిన సాక్ష్యాల ద్వారా నేరస్థుడు పాల్పడిన నేరాన్ని కోర్టు నిరూపించ వచ్చని అన్నారు.ఈ సీసీ కెమెరాలను ప్రధాన రోడ్డు మార్గాల్లో ఎర్పాటు  చేయడం ద్వారా జరిగిన రోడ్డు ప్రమాదాలపై తగు సమీక్షా జరిపి రోడ్డు ప్రమాదాల నివాణకు తగిన జాగ్రత్తాలు తీసుకోవచ్చు అన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం  సిసి కెమెరాలను ఎర్పాటు చేసుకోవాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో మెట్ పెల్లి  డిఎస్పీ గౌస్ బాబా ,సి.ఐ శ్రీను, ఎస్.ఐ లు సదాకర్, రాజునాయక్, రాజాప్రమిలా,పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:CCTV cameras are crucial in crime control

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page