ఏవోబీలో ఎదురుకాల్పులు

0 8,759

విశాఖపట్నం  ముచ్చట్లు:

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.  ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా అటవీప్రాంతంలో బలగాలకు  మావోయిస్టులు తారసపడ్డారు. దాంతో ఇరువురి మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టు అగ్ర నాయకుడుతో సహమరికొంతమంది ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నట్లు ఒడిశా పోలీసుల వెల్లడించారు. వారిలో  ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు జాంబ్రి  వున్నట్లు సమాచారం. ఘటనా స్థలినుంచి పెద్ద ఎత్తున మావోయిస్టు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.  మల్కన్ గిరి ఎస్పీ ప్రహల్లాద్ మీనా  తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం మల్కన్ గిరి మరియు కోరాపుట్ జిల్లాల సరిహద్దులోని బడిలి కొండపై ఒక పెద్ద మావోయిస్టు శిబిరం ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపిన తరువాత, ఎస్‌వోజీ, డీవీఎఫ్‌ మరియు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆ ప్రాంతంలో గాలింపు నిర్వ‌హించామ‌ని బుధ‌వారం బాగా పొద్దుపోయాక  గాలింపు బ‌ల‌గాలు మావోయిస్టులు నిర్వ‌హిస్తున్న శిభిరానికి చేరుకోగానే మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు.  దీంతో పోలీసులు ప్ర‌తిగా కాల్పులు జ‌రిపారు. సుమారు   రెండు గంటల పాటు  మావోయిస్టుల‌కు పోలీసుల‌కు మ‌ద్య ఎదురుకాల్పులు జరిగాయని ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు కాల్పులు జ‌రుపుకుంటూ శిభిరం నుంచి త‌ప్పించుకున్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Counter-fire in Awobi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page