18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి

0 8,463

-మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు

రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:

- Advertisement -

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ పు మాధవి రాజు  అన్నారుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గురువారంవేములవాడ తిప్పాపూర్ లోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి ని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు ,  6వ వార్డ్ కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్  సందర్శించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాధవి రాజు  మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలు కూడా వ్యాక్సినేషన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అందరూ వ్యాక్సిన్ వేసుకొని ఆరోగ్యవంతమైన పట్టణంగా మన వేములవాడ ను తీర్చి దిద్దుకోవాలని,ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలు కూడా నిర్లక్ష్యం చేయకుండా సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఇట్టి వాక్సినేషన్ డ్రైవ్ నువినియోగించుకోవాలని  కోరారు.అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో పట్టణ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలనివారు అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రేగులపాటి   మహేష్ రావు ,హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Everyone over the age of 18 should be vaccinated

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page