నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్

0 18

హైదరాబాద్  ముచ్చట్లు:

హైదరాబాద్‌ మహానగరంలో గణేష్ నిమజ్జనానికి అడ్డంకులు తొలగిపోయాయి. హుస్సేన్‌సాగర్ సహా అన్ని చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికిసుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది.దీనిపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. నిమజ్జనంపై హైకోర్టు ఉత్తర్వులు చివరి నిమిషంలో వెలువడినందున ఈ సంవత్సరం అందులో కొన్ని మినహాయింపులు కోరుతున్నట్లు జీహెచ్ఎంసీ ధర్మాసనానికి విన్నవించింది. హైకోర్టు ఉత్తర్వుల్లోని చాలా అంశాలకు తాము కట్టుబడి ఉంటామని, ఒకట్రెండు అంశాలను మాత్రం తక్షణం అమలు చేయలేమని పేర్కొంది.దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. హుస్సేన్‌సాగర్‌‌లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలు ఒక్క ఏడాదికి మాత్రమేనని, వచ్చే ఏడాది నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీల్లేదని పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ కాలుష్యకారకంగా మారిపోయిందని, జల వనరులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

- Advertisement -

నిమజ్జనంపై ఏటా ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకు వస్తున్నారని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 19 నిమజ్జనం నిర్వహించాలని నిర్ణయించినందుకు ఆ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సుప్రీం కోర్టు తీర్పపై భాగ్యనగర ఉత్సవ సమితి సైతం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి మట్టి విగ్రహాన్నే నెలకొల్పతామని కొద్దిరోజుల క్రితమే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించిన సంగతి తెలిసిందే.హుస్సేన్ సాగర్‌లో గణేషుడి విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తీర్పును పునఃపరిశీలించాలని అభ్యర్థించారు. తీర్పులో ప్రధానంగా 4 అంశాలను తొలగించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.అయితే, ఉన్నపళంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

నగర వ్యాప్తంగా నెలకొల్పిన గణేషుడి విగ్రహాలు నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు. ఎప్పటిలాగే.. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయగా.. హైకోర్టు ఉత్తర్వులు ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలోనే.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని జీహెచ్ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యామ్ నిర్మాణానికి కొంత సమయం అవసరం పేర్కొంది. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని, విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు నగరం పరిధిలో లేవు జీహెచ్ఎంసీ తన పిటిషన్‌లో కోర్టుకు వివరించింది. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమన్న జీహెచ్ఎంసీ.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేసామంది. నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని వివరించింది.ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని, నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తామని హైకోర్టు ధర్మాసనానికి జీహెచ్ఎంసీ వివరించింది. కరోనా కట్టడికి మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్య పరుస్తామని తెలిపింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకుండా విగ్రహాలు ఆపితే వాహనాలను రోడ్లపైనే నిలిపివేయాలంటూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇచ్చిన పిలుపును కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. గణేషుడి నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందని జీహెచ్ఎంసీ తన పిటిషన్‌లో పేర్కొంది.
కాగా, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధాన నాలుగు అంశాలను తొలగించాలని జీహెచ్ఎంసీ కోరింది. ఆ నాలుగు అంశాలు ఇవే..
* హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని కోరిన జీహెచ్ఎంసీ.
* ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరిన జీహెచ్ఎంసీ.
* సాగర్ లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని జీహెచ్ఎంసీ వినతి.
* హుస్సేన్ సాగర్ లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని కోరిన జీహెచ్ఎంసీ.
అయితే, ప్రభుత్వ అభ్యర్థనపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారం మధ్యాహ్నం గతంలో తామిచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పులు కుదరవంటూ తాజాగా ఆదేశాలిచ్చింది.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Green signal for immersion

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page