శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాల‌కు సెప్టెంబ‌రు 17న అంకురార్పణ

0 9,660

తిరుమల ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబ‌రు 17న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. సెప్టెంబరు 18 నుండి 20వ‌ తేదీ వరకు అమ్మ‌వారి పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.సెప్టెంబ‌రు 18న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 19న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 20న మహాపూర్ణాహుతి చేప‌డ‌తారు. చివ‌రిరోజు మ‌ధ్యాహ్నం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ఆల‌య ప్రాంగ‌ణంలో చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: Inauguration of Sri Padmavati Ammavari Pavitrotsavala on September 17

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page