సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో

0 8,457

తుగ్గలి ముచ్చట్లు:

మండల కేంద్రమైన తుగ్గలి లో గల గ్రామ సచివాలయ కార్యాలయాన్ని తుగ్గలి ఎంపీడీవో వీర రాజు గురువారం రోజున ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సచివాలయంకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగ యొక్క వ్యక్తిగత రికార్డులను,మూమెంట్ రిజిస్టర్ల ను మరియు ఉద్యోగుల హాజరు పట్టికలను పరిశీలించారు.అదేవిధంగా సచివాలయ పరిధిలోని గల గ్రామ వాలంటీర్ల యొక్క రికార్డులను కూడా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు నిర్ణీత సమయంలో సచివాలయాలకు వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన తెలియజేశారు.గ్రామ సచివాలయాల సేవల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడమే గ్రామ సచివాలయాల యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలియజేశారు. అదేవిధంగా గ్రామ వాలంటీర్లు కూడా తమ పరిధిలోని నివాసాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ పథకాలు మరియు సేవలను సచివాలయాల ద్వారా అందించాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోపాల్,ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ పులి శేఖర్,డిజిటల్ అసిస్టెంట్ అశోక్, విఏఏ లొహిత్ కుమార్ మరియు తదితర సచివాలయ సిబ్బంది,గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Tags:MPDVO who abruptly inspected the Secretariat

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page