18న పరిషత్ ఎన్నికల కౌంటింగ్

0 8,777

విజయవాడ  ముచ్చట్లు:

ఫలితాల ప్రకటనకు క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ పై ఎస్ఈసీ కసరత్తు ప్రారభించింది. కౌంటింగ్ తేదీల ఖరారుపై అధికారులతో ఎస్ఈసీ నీలం సాహ్నీ శుక్రవారం సమావేశం కానున్నారు. హైకోర్టు తీర్పుపై ఎస్ఈసీ అధ్యయనం చేయనున్నారు. కౌంటింగ్ నిర్వహణ తేదీల ఖరారుపై ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నీలం సాహ్నీ చర్చలు జరుపనున్నారు. సాధ్యమైనంత త్వరగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. కౌటింగ్ చేపట్టేందుకు కావలిసిన సిబ్బంది, పటిష్టమైన భద్రతా చర్యలపై సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 18 న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.ఆగిపోయిన పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు నేడు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది త్రిసభ్య ధర్మాసనం. హైకోర్టు ఆదేశాలతో 515 జడ్పీటీసీ, 7,321 ఎంపీటీసీ సీట్లకు కౌంటింగ్‌ జరుగుతుంది. తేదీని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఫైనల్‌ చేయాల్సి ఉంటుంది. ఎన్నో పరిణామాల తర్వాత గత ఏప్రిల్‌ 8న  పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 4 వారాల గడువు లేకుండా షెడ్యూల్‌ ఇచ్చారంటూ టీడీపీ, జనసేన సహా పలువురు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. దాంతో ఆ ఎన్నికలను రద్దు చేసింది సింగిల్‌ జడ్జి బెంచ్‌. కొత్త షెడ్యూల్‌ విడుదల చేయాలని ఆదేశించింది. దానిపై  ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్‌కు వెళ్లాయి.మొత్తం 9,692 ఎంపీటీసీ సీట్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పలు కారణాల వల్ల 354 ఎంపీటీసీ సీట్లలో ఎన్నిక ఆగింది. మిగిలిన 7,321 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు రాష్ట్రంలో ఉంటే 652 జడ్పీటీసీసీట్లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 126 జడ్పీటీసీ సీట్లలో ఎన్నిక ఏకగ్రీవం అయింది. 515 జడ్పీటీసీ సీట్లలో ఎన్నిక జరిగింది.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Parishad election counting on 18th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page