బుద్ధిమాంద్యం బాలికల బంగారు భవిష్యత్తే లక్ష్యం.. ఎస్ఏ అసిస్టెంట్ విజయ లలిత

0 8,461

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

సమాజంలో సమానంగా అందరి పిల్లలు మాదిరిగానే బుద్ధి మాంద్యం గల పిల్లలు ఎదగాలనే తపనతో ఎంఎస్ జెడ్పిహెచ్ (బాలికల)పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న విజయలలిత తమ అఖుంటిత దీక్షతో,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌసియా బేగం సహాయసహకారములతో పదవ తరగతి పూర్తి చేసుకున్న సిడబ్ల్యు ఎస్ఎన్ బాలికలు అయిన నాగలక్ష్మి, రత్నమ్మ,సుజాతలకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్(బాలికల)ఇంటర్ లో హెచ్ఈసి (తెలుగు) మీడియం,హైమావతి అనే అమ్మాయి కోరిక మేరకు ప్రైవేటు కాలేజి లో రాయితీ ఫీజ్ తో ఎంపిసి ఇంగ్లీషు మీడియం లో ప్రవేశం కల్పించారు.ఈసందర్భంగా స్కూల్ అసిస్టెంట్  విజయలలిత మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌసియా బేగం సహాయ సహకారములతో సమాజంలో మంచిగా ఉన్న విద్యార్థులు మాదిరిగానే కుటుంబంనకు,సమాజానికి భారంగా ఉండ కూడదనే ధృఢ నిశ్చయం తో పదవ తరగతి పూర్తి చేసుకున్న సిడబ్ల్యుఎస్ఎన్ బాలికలను వారి ఉన్నత చదువులు చదివించుకోవాలని, వారి కాళ్ళ పై వారు నిలబడే విధంగా వారి తల్లిదండ్రులకు అనేక రకాలుగా నచ్చజెప్పి ఈరోజు ఆ విద్యార్థినులను కాలేజి లో చేర్పినందుకు చాలా సంతోషంగా ఉందని, వారి ముఖాల్లో ఆనందం చూడటమే మా లక్ష్యం అని తెలిపారు. అలాగే ఒక అమ్మాయి కి ఫించన్ రాకపోవడంతో సదరం క్యాంపు నుండీ ప్రత్యేకంగా సదరం ధ్రువీకరణ పత్రం తెప్పించి మరీ ఫించన్ తెప్పించామని తెలిపారు,

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:The golden future of dementia girls is the goal..SA Assistant Vijaya Lalitha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page