జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

0 9,698

తిరుపతి ముచ్చట్లు:

 

వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించారు.ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి చ‌తుష్టార్చాన‌, అగ్ని ప్ర‌తిష్ట‌, ప‌విత్ర ప్ర‌తిష్ట నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి.

 

 

- Advertisement -

కాగా సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న మహాపూర్ణాహుతి, సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆల‌యంలో ఊరేగించ‌నున్నారు.యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో  ముర‌ళీధ‌ర్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  మునికుమార్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: The holy festivals begin at the Jammalamadugu Sri Narapura Venkateswaraswamy Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page