జీవీఎంసీ అదాయానికి గండి కొడుతున్న మేయర్

0 8,787

విశాఖపట్నం ముచ్చట్లు:

జీవీఎంసీ మేయర్ ,కమిషనర్ ఆధ్వర్యంలో అడ్డగోలుగా కమిటీలు వేసి జివిఎంసి ఆదాయానికి గండి కొడుతున్నారు అని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు..  విశాఖపట్నంలొ నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ జీవీఎంసీ షాపులు, షాపింగ్ కాంప్లెక్స్ లు, కళ్యాణ మండపాలు, మార్కెట్లు విషయంలో లీజుదారుల  నుంచి లీజ్ డబ్బులు వసూలు చేయకుండా ఇప్పటివరకు జీవీఎంసీ అధికారులు తాత్సారం చేస్తూ వస్తున్నారని.. దీనివల్ల మొండిబకాయిలు కుప్పలుతెప్పలుగా పెరిగిపోయాయని ఆయన అన్నారు… జీవీఎంసీ  సంబంధించి లీజుదారుల నుంచి తక్షణం బకాయిలు వసూలు చేయాలనె విషయం జీవీఎంసీ కమిషనర్ కు జోనల్ స్థాయి అధికారులకు తెలిసినా కూడా బకాయిల వసూలు చేయకుండా జివిఎంసి రెవెన్యూకి గండి కొడుతున్నారని అన్నారు.. మున్సిపల్ చట్టం ప్రకారం ఏదైనా కమిటీని నియమించాలి అంటే 2/3 మెజారిటీ ఉండాలని 2/3 మెజారిటీ తో పాటుగా కౌన్సిల్ లో తీర్మానం చేయాలని.. అలా కాకుండా జీవీఎంసీ కమిషనర్, మేయర్ తమకు ఇష్టం వచ్చినట్లుగా నూతన కమిటీలను ఏర్పాటు ఆయా కమిటీల ద్వారా లీజు దారుల నుంచి అక్రమ దారుల నుంచి అడ్డగోలుగా కమీషన్లకు కక్కుర్తిపడి లీజు బకాయిలు పెండింగ్ ఉన్న సరే అటువంటి దుకాణాల పై చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు..

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:The mayor who is slashing GVMC revenue

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page