టిటిడి బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితుడిగా   భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

0 9,684

తిరుమల ముచ్చట్లు:

 

 

టిటిడి నూత‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌త్యేక ఆహ్వానితుడిగా తిరుప‌తి ఎమ్మెల్యే  భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా తుడ ఛైర్మ‌న్ డా.చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత టిటిడి అద‌నపు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, డా.చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం అద‌న‌పు ఈవో శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని అందించారు.అనంత‌రం ఆల‌యం వెలుప‌ల  క‌రుణాక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి కృప‌తో రెండో సారి టిటిడి బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా అవ‌కాశం రావ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. త‌న‌కు ఈ అవ‌కాశం క‌ల్పించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. బోర్డు ఛైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. హైంద‌వ ధ‌ర్మ సంస్కృతిని, ఆచారాల‌ను కాపాడ‌డంతోపాటు టిటిడి ప్ర‌తిష్ట‌ను మ‌రింత పెంచేందుకు కృషి చేస్తాన‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ సుధారాణి, పేష్కార్  శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags; TTD Board Special Guest Bhoomina Karunakarreddy, Ex-Officio Member Dr. Chevireddy Bhaskarreddy sworn in

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page