వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి వెంటనే చేర్చాలి

0 9,273

తుగ్గలి ముచ్చట్లు:

 

వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గుంత దేవి మరియు జొన్నగిరి విద్యా కమిటీ చైర్మన్ గుంత రఘు లు తెలియజేశారు. గురువారం రోజున విజయవాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు ఏర్పాటుచేసిన వాల్మీకి సమావేశంలో రాష్ట్రానికి చెందిన వాల్మీకి నాయకులు,ప్రభుత్వ ప్రతినిధులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ వాల్మీకుల ప్రత్యేక సమావేశానికి మంత్రి గుమ్మనూరు జయరాం,సజ్జల రామకృష్ణారెడ్డి అక్కిరెడ్డి,బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాల్, నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వాల్మీకి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు వాల్మీకులను ఎస్టీ జాబితాలో వెంటనే చేర్చాలని,అదేవిధంగా వాల్మీకులకు కార్పొరేషన్ లను ఏర్పాటు చేసి లోన్ లను అందజేయాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా వాల్మీకి కుల వృత్తుల పై కూడా చర్చలు జరిపారు.వాల్మీకి జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి,వాల్మీకి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు తీర్మానించుకున్నారు. ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో కమిటీని వేసి వాల్మీకుల డిమాండ్లను పరిష్కారం కొరకు కృషి చేస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తెరప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags; Valmiki should be added to the EST list immediately

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page