వానలే..వానలు

0 8,501

విశాఖపట్టణం  ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈరోజు, రేపు , ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.దక్షిణ కోస్తా ఆంధ్ర :ఈరోజు, రేపు , ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉందిరాయలసీమ:ఈరోజు, రేపు , ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.రాష్ట్రాల్లో గత వారం పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్ని విషయం తెలిసిందే. రెండు, మూడు రోజుల నుంచి కొంత గ్యాప్ ఇచ్చినట్లు కనిపించినా రోజులో ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు వేడిగా ఉండి.. ఆ తర్వాత సాయంత్రానికి వాతావరణం మారిపోతోంది. పలు చోట్ల సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక రైతులు చాలా ప్రాంతాల్లో నాట్లు వేశారు. విత్తు పెట్టారు. కాగా అతివృష్టి కారణంగా ఈసారి ప్రమాదం ఎదుర్కొవాల్సి వస్తుందేమో అన్న భయంలో అన్నదాతలు ఉన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Vānalē..Vānalu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page