వైఎస్అర్ టీ యూ సీ ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టి బొమ్మ దగ్దం

0 9,863

తిరుపతి ముచ్చట్లు:

 

శుక్రవారం ఉదయం అమరావతి లోని చంద్రబాబు ఇంటి దగ్గర ప్రశాంతం గా నిరసన తెలుపుతున్నా క్రిష్ణా జిల్లా పెడన శాసన సభ్యులు జోగి రమేశ్ పై టీడీపీ గుండాలు దాడి చేయడాన్ని నిరశిస్తూ వై ఎస్ ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి ఆధ్వర్యంలో బైరాగిపట్టేడా లోని ఇండియన్ బ్యాంక్ సర్కిల్ వద్ద టీ డి పీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు దిష్టి బొమ్మ ను దగ్దం చేశారు. ఈ సందర్బం గా ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజున టీ డి పీ నాయకులు అయ్యన్న పాత్రుడు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శాసన సభ్యులు జోగి రమేశ్ ప్రసాంతంగా నిరసన తెలుపుతుంటే చంద్రబాబు డైరెక్షన్లో బుద్ద వెంకన్న అడ్వర్యంలో జోగి రమేశ్ పై దాడి చేసారని కారును ద్వంసం చేసి నానా బూతులు తిట్టడం జరిగిందని చంద్రబాబు రౌడీ రాజకీయం రాష్ట్ర ప్రజలు హర్షిం చరని తెలిపారు. వై ఎస్ ఆర్ పార్టీ కార్య కర్త లపై దాడి చేస్తే చూస్తు ఊరు కొరని హెచ్చరిం చారు. ఈ కార్య క్రమంలో వై ఎస్ ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు రపీ హిందుష్టాని, షేక్ మహ్మద్ రపీ, యశోద, కిరణ్ కుమార్ రెడ్డి, ఆటో యూనియన్ నాయకులు ముని క్రిష్ణా, పలని, బాల క్రిష్ణా, సుబ్రమణ్యం, మూరళీ, పండు, మోహన్ రవి, అశోక్ తడితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: Chandrababu Dishti toy burnt under the auspices of YSRTUC

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page