కాణిపాకం మైనర్ బాలికలను కాపాడిన దిశా sos

0 9,735

కాణిపాకం ముచ్చట్లు:

సమాచారం అందుకొన్న వెంటనే వేగంగా స్పందించి కీచకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశా ఆప్ ముందడుగు వలన కాణిపాకం లో 16-09-2021 వ తేదిన ఒక మైనర్ బాలిక ఒక కీచకుడు బారి నుంచి రక్షించ బడినది. చిగారపల్లి హరిజనవాడ లో నివాసం ఉంటున్న కేశవులు, 55 సం.లు, వృతి రీత్యా కూలి, తన ప్రక్క ఇంటిలో నివాసం ఉంటున్న మైనర్ బాలిక మీద కామ వాంఛ తో, మంచి మాటలు చెప్పి తన ఇంటి కి పిలుచుకొని పోయి, అమ్మాయి శరీరాన్ని అసభ్యకరంగా తాకుతూ వికృత చేష్టలు చేసినాడు. ముద్దాయి కేశవులు చేస్తున్న వికృత చేష్టలను గమనించిన మరొక్క అమ్మాయి వారి బంధువులకు తెల్పినది. విషయం తెల్సుకొన్న అమ్మాయి పెద్దమ్మ వెంటనే తన ఫోన్ లో గ్రామ మహిళా పోలీస్ మరియు వాలంటీర్ ద్వార డౌన్లోడ్ చేసుకొన్నా దిశా ఆప్ గుర్తుకు వచ్చి 7.30 pm గంటలకు దిశా ఆప్ sos ద్వార పోలీస్ లకు సమాచారం అందించినది.

 

- Advertisement -

కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకొన్న కాణిపాకం ఎస్.ఐ  G.రమేష్ బాబు, తన సిబ్బంది తో పాటు కేవలం 3 నిమిషాలలోనే సంఘటన స్థలానికి హుట హుటిన చేరుకొని మైనర్ బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించిన కీచకుడు కేశవులను ను అదుపులోకి తీసుకొ. SOS cal చేసిన బందువును అభినందించారు.
దిశా ఆప్ sos cal ద్వార సమాచారం ఇచిన 3 నిమిషాలలోనే స్పందించి పోలీస్ వారు తమ వద్దకే వచ్చి మైనర్ బాలికను కామాంధుడి నుంచి రక్షించి వారి భవిష్యత్తును కాపాడారని, దిశా ఆప్ వలన తమకు ఎంతో ఉపయోగపడిందని కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. దీనిపై బాలిక అమ్మమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేశవులు పైన Cr.No 46/2021 కేసును నిర్భయ చట్టం మరియు POCSO చట్టం లోని పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

ఈ సందర్భంగా ఎస్.పి  మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్య మంత్రి  ఆదేశానుసారం మహిళల, బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా ఈ దిశా యాప్ ను డెవలప్ చేయడం జరిగిందని, మన దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి అవకాశం లేదని, ఇంతకు ముందు మహిళలకు, బాలికలకు ఏదైనా ఇబ్బంది కలిగితే పోలీసు స్టేషన్ కు వెళ్ళాల్సి వచ్చేది అని, అందుకోసమే చాలా మంది తమకు జరిగే అన్యాయాలను, ఇబ్బందులను పోలీసుల దృష్టికి తీసుకు రాకుండా ఉండే వాళ్ళు అని, కాని ఇప్పుడు అలాంటి ఇబ్బంది అవసరం లేదని, స్మార్ట్ ఫోన్ ఉండి దిశా APP డౌన్లోడ్ చేసుకొని ఉన్న మహిళలు తమకు ఏదైనా అపాయం కల్గినప్పుడు వెంటనే తమ ఫోన్ ను 5 సార్లు షేక్ చేస్తే చాలు, వెంటనే ఈ దిశా SOS యాప్ ఆక్టివేట్ అయ్యి వారి లొకేషన్ తో సహా పోలీసు వారికి సమాచారం వెలుతుంది, వెంటనే పోలీసులు ఆ మహిళా నెంబర్ కు కాల్ చేసి ఎలాంటి సమస్యో కనుక్కొని అత్యంత తక్కువ సమయంలో ఆపదలో ఉన్న వారి దగ్గరకు వస్తారు. ఈ యాప్ ఎంత బాగా పని చేస్తుందో, దీని వలన ఎంత ఉపయోగమూ ఇప్పటికే చాలా మంది మహిళలకు అవగాహన ఉందని, చిత్తూరు జిల్లా నందు ఇప్పటివరకు జరిగిన రెండు సంఘటనలలో పోలీసు వారు 4 నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలానికి చేరుకొని భాదితులను కాపాడి ముద్దాయిలను అరెస్ట్ చేసి POCSO యాక్ట్ క్రింద కేసులు నమోదు చేయడం అయినదని, ఇప్పటివరకు జిల్లా నందు సుమారు 7.5 లక్షల మంది దిశా యాప్ ను ఇన్స్టాల్ చేసుకొని ఉన్నారని, ఆపద ఏ సమయలో ఎవరికి వస్తుందో తెలియదు మన రక్షణ మన చేతులలోనే.. కావున ప్రతి ఒక్కరు ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని కోరారు.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: Disha sos who saved the appearance minor girls

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page