టీటీడీ నూతన పాలక మండలి సభ్యులుగా ఎమ్మెల్యే కిలివేటి

0 9,867

నెల్లూరు ముచ్చట్లు:

 

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులుగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య నియమితులయ్యారు. టిటిడి నూతన పాలకవర్గ సభ్యులుగా  సూళ్లూరుపేట శాసనసభ్యులు  కిలివేటి సంజీవయ్య ఎన్నిక కావడంతో జిల్లా వైకాపా నాయకులు ఆయనకు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని స్థానిక ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాది దేవుని సన్నిధిలో స్వామివారి భక్తులకు సేవలు అందించే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా  భావించాల్సి ఉందన్నారు. దేవాది దేవుడు శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాజకీయంగా మరెన్నో పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయడైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి మరియు సన్నపరెడ్డి సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: MLA Kiliveti is a member of the new governing body of TTD

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page