విమోచన దినం జరిపించాలి -కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

0 8,220

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా  బీజేపీ నగర,రాష్ట్ర కార్యాలయలల్లో  జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి  జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్,బీజేపీ సీనియర్ నేతలు వివేక్, ఎన్  రామచంద్ర రావు తదితరులు హజరయ్యారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. నిజాం పరిపాలన పోవాలి. ,మేము స్వేచ్ఛ వాయువులు పీల్చాలి అని ప్రజలు కన్న కలలను పటేల్ తీర్చారు. చరిత్రాత్మక 17 సెప్టెంబర్ ను  అధికారికంగా నిర్వహించలని బీజేపీ పోరాటం చేస్తూనే ఉంది. వచ్చే ఏడాదికి 75 ఏళ్ళు అవుతుంది,నెక్స్ట్ ఇయర్ అన్న విమోచన దినోత్సవాన్ని చేయాలి. ఎంఐఎం మోచేతి నీళ్లు తాగుతూ కేసీఆర్   7 ఏళ్లుగా విమోచన దినోత్సవాన్ని మరిచారు. ఎంఐఎం  కేసీఆర్ కుటుంబం హుజూర్ సలాం అంటుంది. నిర్మల్ కు అమిత్ షా వస్తున్నారు. నిజాం హయంలో ఒక్క నిర్మల్ లొనే 1000 మందిని ఉరితీశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో,అన్ని బస్తీల్లో విమోచన దినోత్సవ వేడుకలు అధికారకంగా జరగాలి. 25 ఏళ్లుగా దీనిపై పోరాటం చేస్తున్నాం,అధికారకంగా నిర్వహించే వరకు బీజేపీ పోరాటం ఆగదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 17 సెప్టెంబర్  నిర్వహించాలని మొదటి సంతకం పెడతామని అన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags; Redemption Day should be celebrated – Union Minister Kishan Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page