ఎస్సీ వర్గీకరణ సాధన సమీక్ష సమావేశం

0 9,262

– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి రాక

 

నెల్లూరు ముచ్చట్లు:

 

- Advertisement -

ఎస్సీ వర్గీకరణ సాధన సమీక్ష సమావేశం స్థానిక అంబేద్కర్ భవన్ నందు శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించబడుతుందని, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మందా పెంచలయ్య మాదిగ పేర్కొన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, మరో అంబేద్కర్ మంద కృష్ణ మాదిగ సారథ్యంలో ఎస్సీ వర్గీకరణ సాధనలో భాగంగా రాష్ట్ర, జిల్లాస్థాయి ఉద్యమాలు ఎన్నో చేసుకున్నామని గుర్తు చేశారు. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ ఆఖరి ఘట్టం లో భాగంగా జిల్లాలో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు లో జరుగుతున్న ఎస్సీ రిజర్వేషన్లు ఖరారు లో భాగంగా కచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ సాధించుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల మాదిగ కులాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురు పార్టీ బ్రహ్మయ్య మాదిగ రానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బెల్లంకొండ గోపి, సిటీ నాయకులు తాటిపర్తి రాజా, రూరల్ మండల నాయకులు సగిలి అమర్నాథ్ , లేబూరు వెంకటేశ్వర్లు, చింతగుంట సాయి, గంపాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: SC Classification Instruments Review Meeting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page