శాస్త్రోక్తంగా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

0 9,262

తిరుపతి ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాల‌కు శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు. ఇందుకోసం సాయంత్రం 6 గంట‌ల‌కు విష్వక్సేనపూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, మృత్సంగ్రాహ‌ణం, అంకురార్పణ జ‌రిగింది.సెప్టెంబరు 18వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చ‌తుష్ఠార్చ‌న‌, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 19వ తేదీ ఉదయం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6 గంటలకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 20న ఉదయం 6 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ త‌దిత‌ర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఆల‌యంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించ‌నున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఏఈవో  మురళీధర్ , టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: Scientifically, Kadapa is the beginning of the holy festival of Sri Lakshmi Venkateswaraswamy.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page