టిటిడికి రూ.కోటి విరాళం అందించిన ఎస్వీ బాలమందిర్ పూర్వ విద్యార్థి పి.విశ్వనాథ్

0 9,687

– అభినందించిన ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

 

తిరుమల ముచ్చట్లు:

 

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహిస్తున్నశ్రీ వేంకటేశ్వర బాల మందిర్ లో విద్యనభ్యసించి, ఫేస్ బుక్ సంస్థలో ఉన్నత ఉద్యోగంలో స్థిరపడ్డ  విశ్వనాథ్ పూసల, వీరి సతీమణి శ్రీమతి ధరణి శుక్రవారం టిటిడికి కోటి రూపాయల విరాళం అందించారు.తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిని   విశ్వనాథ్ కుటుంబ సభ్యులు కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందించారు. తిరుపతికి చెందిన టిటిడి రిటైర్డ్ డెప్యూటీ ఈఓ  పూసల ఆంజనేయులు కుమారుడు పూసల విశ్వనాథ్ 1976 -81 మధ్య శ్రీ వేంకటేశ్వర బాల మందిరంలో చదువుకున్నారు. 1981-85 వరకు ఎస్వీ హైస్కూల్ లో చదివి పదవ తరగతిలో ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. 85 -87 వరకు ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1987లో చెన్నై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ సీటు సంపాదించిన మొదటి విద్యార్థిగా నిలిచారు. అనంతరం 1992 నుంచి 95 దాకా అమెరికాలోని విస్కాన్సిన్ లో పిహెచ్ డి పూర్తిచేసి ప్రస్తుతం ఫేస్ బుక్ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. వీరి సోదరుడు   సురేష్ వీరి ఎదుగుదలకు ఎంతో సహకరించారు.పూసల విశ్వనాథ్ తనకు విద్యాదానం చేసి తన ఎదుగుదలకు దోహదం చేసిన మాతృసంస్థను మరువకుండా కోటి రూపాయలు విరాళం అందించడమే కాకుండా ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని టిటిడి ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆయనను అభినందించారు.

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: SV Balamandir alumnus P Vishwanath donated Rs 1 crore to TTD

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page