భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం

0 9,278

-టిటిడి చైర్మన్  వై వి సుబ్బారెడ్డి వెల్లడి

 

తిరుమల ముచ్చట్లు:

 

- Advertisement -

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్   వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు.తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ రోజుకు 15 నుంచి 20 వేల మంది భక్తులకు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని చైర్మన్ వివరించారు. ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని, త్వరలోనే ఈ సమస్యను అధిగమించి ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని చెప్పారు.

 

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: This decision is for the health security of the devotees and staff

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page