వికారాబాద్‌లో గోస‌ద‌న్‌ను ప‌రిశీలించిన టిటిడి అద‌న‌పు ఈవో

0 9,861

తిరుపతి ముచ్చట్లు:

 

గో ఆధారిత వ్య‌వ‌సాయం, ప్ర‌కృతి సాగులో అవ‌లంబిస్తున్న మెళ‌కువ‌ల‌ను ప‌రిశీలించేందుకు టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి శుక్ర‌వారం తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని గ‌ట్టేప‌ల్లిలో గ‌ల సౌభాగ్య గోస‌ద‌న్‌ను ప‌రిశీలించారు.ఈ సంద‌ర్భంగా ప్ర‌కృతి సాగు నిపుణులైన  విజ‌య‌రామ్ త‌న సాగుభూమిలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా ఆరోగ్య‌క‌ర‌మైన పంట‌లు, పండ్ల‌ను పండించే ప‌ద్ధ‌తుల‌ను అద‌న‌పు ఈవోకు వివ‌రించారు. గోశాల‌లో దేశీయ గోజాతుల సంర‌క్ష‌ణ విధానాల‌ను తెలియ‌జేశారు. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరికి చెందిన  ముర‌ళి అనే దాత త‌న 300 ఎక‌రాల్లో గో ఆధారిత వ్య‌వ‌సాయం చేసేందుకు ముందుకొచ్చార‌ని అద‌న‌పు ఈవోకు తెలిపారు.అద‌న‌పు ఈవో వెంట టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు   శివ‌కుమార్‌, చిరు ధాన్యాల ఆహార నిపుణులు   రాంబాబు, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, దేశీయ గోవుల ప్ర‌చార‌కుడు   వాసు, వెంక‌ట‌గిరికి చెందిన దాత   ముర‌ళి ఉన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: TTD inspects Gosain in Vikarabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page