ఆసిఫాబాద్‌ జిల్లాలో యూరియా కొరత

0 4,846

అదిలాబాద్ ముచ్చట్లు:

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో యూరియా కొరత వేధిస్తోంది. కొందరు వ్యాపారులు పక్కనున్న మహారాష్ట్ర నుంచి తెప్పించి బ్లాక్లో అమ్ముతున్నారు. కృతిమ కొరత సృష్టించి రైతులను దోచుకుంటున్నారు. నియంత్రించాల్సిన ఆఫీసర్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. వేసిన పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సర్కార్ అందించే యూరియా సరిపోవడంలేదు. దీంతో చాలామంది ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న కొందరు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. సర్కార్ అందించే ధరకు రెండింతలు పెంచి అమ్ముతున్నారు. సహకార సంఘాల ద్వారా ఒక బస్తా రూ.266.50 లకు అమ్ముతుండగా ప్రైవేట్ వ్యాపారులు రూ.400కు బస్తా అమ్ముతున్నారు.జిల్లాలో  3.40 లక్షల ఎకరాల్లో పత్తి, 60,323 ఎకరాల్లో వరి సాగవుతోంది. దీనికి 49 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం గవర్నమెంట్ 26 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది.దీంతో దళారులు యూరియా మహారాష్ట్ర నుంచి తెప్పించి అమ్ముతున్నారు.రైతుల అవసరాన్ని తెలుసుకున్న ఎరువుల వ్యాపారులు ఏటా ఎరువులు, పురుగుల మందుల కొరత సృష్టిస్తున్నారు. సర్కార్ యూరియా అందక పోవడం… పంటలకు ఎరువులు వేసే టైం ఎత్తిపోతుండడంతో చాలామంది రైతులు ధర ఎంతైనా సరే అంటూ దళారులను ఆశ్రయిస్తున్నారు. అవసరాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్న కొందరు యథేచ్ఛగా దందా నడుపుతున్నారు.ఏజెన్సీలోని రైతులకు జైనూర్ మార్కెట్ మెయిన్ సెంటర్. దాదాపు 30 మంది వరకు ఫర్టిలైజర్ డీలర్లు ఉన్నారు. ఇక్కడే సిర్పూర్ (యు) ,లింగాపూర్ మండలాల రైతులు ఎరువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు యూరియా బ్యాగ్ యూరియా ధర 266 ఉంటే రూ. 350 నుంచి 400 వరకు అమ్ముతున్నట్లు పలువురు ఆరోపించారు. రసీదు కూడా ఇవ్వడంలేదని తెలిపారు.యూరియా అధిక ధరకు అమ్మితే కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. బస్తా రూ. 266.50 లకు మించి అమ్మొద్దన్నారు. అయినా అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. డీలర్ల లైసెన్స్లు రద్దు చేస్తామని చెప్పారు. అయినా ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించడంలేదు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags:Urea shortage in Asifabad district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page