రెండేళ్ళ విరామం తరువాత, ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఆవిష్కరణ

0 9,686

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ప్రైమ్ వాలీబాల్ లీగ్ దేశంలో ఫ్రాంచైజీ ఆధారిత స్పోర్ట్స్ లీగ్స్ సంప్రదాయక నమూనా నుంచి నాటకీయ మార్పిడికి నాంది పలికింది.రెండేళ్ళ విరామం తరువాత, ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఆవిష్కరణతో అగ్రస్థాయి వాలీబాల్ యాక్షన్ మరోసారి భారతీయ స్క్రీన్ లపై దర్శనమివ్వనుంది.  ఎన్బీఏ వంటి ప్రముఖ అంతర్జాతీయ లీగ్స్ తరహాలో ఈ లీగ్ నిర్వహణలో ఫ్రాంచైజీ యజమానులు సైతం పాలుపంచుకోనున్నారు. ఫ్రాంచైజీలు కూడా దీన్ని స్వాగతిస్తున్నాయి. ఎందుకంటే ఇది జట్టు యజమానులకు, ఇన్వెస్టర్లకు మరింత విలువను అందిస్తుంది. దీర్ఘకాలిక అను బంధా లను నెలకొల్పుతూ నిలకడతో కూడిన ఆర్థిక నిర్మాణాన్ని అందిస్తుంది. ప్రైమ్ వాలీబాల్ లీగ్ మొదటి ఎడిషన్ లో ఆరు జట్లు  ఉండనున్నాయి. వీటిలో ఐదు గతంలోనూ ఈ వాలీబాల్ లీగ్ తో అనుబంధం కలిగి ఉన్నవే – కాలికట్ హీరోస్, కొచి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెం డర్స్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై బ్లిట్జ్. కొత్తగా బెంగళూరు టార్పెడోస్ కూడా రంగప్రవేశం చేసింది. దీని లీడ్ యజమాని శ్రీ అంకిత్ నగోరి. ఈట్ ఫిట్ వ్యవస్థాపకులు. ఈ లీగ్ సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ పై ప్రసారం కానుంది. దేశంలో అగ్రగామి స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థ అయిన బేస్ లైన్ వెంచర్స్ చే ఎక్స్ క్లూజివ్ గా మార్కెట్ చేయబడనుంది. ఫాంటసీ గేమ్స్ అగ్రగామి ఎ23 అనేది బహుళ సంవత్సరాలకు గాను ‘పవర్డ్ బై’ స్పాన్సర్ గా ఉండేందుకు ముందుకు వచ్చింది.

 

 

 

- Advertisement -

ఈ సందర్భంగా ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈఓ జోయ్ భట్టాచార్య మాట్లాడుతూ, ‘‘దేశంలో ఎంతటి ప్రతిభావం తులున్నారో  మనం ఇంతకు ముందే చూశాం. వారు ఎదిగేందుకు సరైన వేదికను అందించేందుకే మా ప్ర యాణం. ఈ విధమైన నిర్మాణంలో ఫ్రాంచైజీలు దీర్ఘకాలానికి కట్టుబడి ఉంటాయి. అది ఈ క్రీడ సుస్థిరదా యక రీతిలో ఎదిగేందుకు అవకాశాన్ని అందిస్తుంది. భారతీయ వాలీబాల్ కు అదెంతో మంచిది’’ అని అ న్నారు. లీగ్ త్వరలోనే వేలం తేదీలను, రాబోయే సీజన్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనుంది.వర్ధమాన  క్రీడాకారులకు, కోచింగ్ సిబ్బందికి అవకాశాలను కల్పించే ప్రయత్నంలో భాగంగా వారి కోసం ఒక పోర్టల్ నిర్మించేందుకు పిస్టన్ డెస్ స్పోర్ట్స్ తో  ప్రైమ్ వాలీ బాల్ లీగ్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. క్రీడాకారులు, కోచ్ లు ఈ కార్యాచరణలో భాగం అయ్యేందుకు వారు తమ పేర్లను నమోదు చేసుకునేం దుకు ఇది వీలు కల్పిస్తుంది.ఆసక్తి గల ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది తమ పేర్లను www.pistondessport.com లో నమోదు చేసుకోవచ్చు.

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: After a two-year hiatus, the Prime Volleyball League was launched

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page