ఎల్లారెడ్డిలో బీజేపీ రోడ్ షో

0 9,005

-ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి బండి సంజయ్

 

కామారెడ్డి ముచ్చట్లు:

 

- Advertisement -

బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డి లో పార్టీ నేతలు, శ్రేణులు రోడ్ షో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ లో కొత్తగా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి. మోడీ జన్మదినం సందర్బంగా ఒక్క రోజే రెండున్నర కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించాము. బీజేపీ అధికారం లోకి వస్తే తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులందరికి పింఛన్లు అందిస్తాం. విమోచన దినం రోజున జండా ఎగురవేయని కేసీఆర్ తెలంగాణ ద్రోహి. ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సీఎం గా కొనసాగే అర్హత లేదని అన్నారు.కేసీఆర్ ఒక అహంకారి. ప్రతి ధాన్యం గింజ కొంటానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారు. రైతులు లక్షాధికారులు కావడం మాటెమోగాని కేసీఆర్ మాత్రం కోటీశ్వరుడయ్యాడు. ఢిల్లీ లో బియ్యం ఎగుమతులపై జరిగిన మీటింగ్ కు డుమ్మా కొట్టి ఇప్పుడు కేంద్రం ధాన్యం కొనడం లేదంటూ రాజకీయం మొదలు పెట్టారు. పోలీసులకు జీతాలు లేవు ప్రమోషన్లు లేవు. జీతలు ఇవ్వలేని ముఖ్యమంత్రి దళిత బంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: BJP road show in Ellareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page