భైంసాలో భారీ బందోబస్తు

0 9,875

నిర్మల్ ముచ్చట్లు:

 

నిర్మల్ జిల్లా  సమస్యాత్మక ప్రాంతం అయిన భైంసా లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నిమజ్జనానికి 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు, 150 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసారు. ఒక అదనపు ఎస్పీ తో పాటు ఇద్దరు ఏ ఎస్పీలు,3 డిఎస్పీలు,11 మంది సీఐ లు,36 ఎస్సై లు, 251 మంది కానిస్టేబుళ్లు,37 హోంగార్డు లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. వీటితో పాటు 10 పికెటింగ్ పాయింట్లు,6 బైక్ పార్టీ లతో గస్తీ కాయనున్న పోలీసులు..వీటితో పాటు 120 మంది వాలంటరీ లను ఏర్పాటు చేశారు.  అన్ని దుకాణ సముదాయాలు అన్ని మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 10 :30 నిమిషాలకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనం పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. గడ్డేన్న వాగు ప్రాజెక్టు లో నిమజ్జనం కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags: Huge provision in Bhainsa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page