ఇవాళ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు…

0 9,696

హైదరాబాద్ ముచ్చట్లు:

 

వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం అర్థరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషేధాజ్ఞలు పెట్టారు. ఆర్టీసీ బస్సులను సైతం పలు చోట్ల దారి మళ్లించే ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర సాగే మార్గం మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో నగర ప్రజల కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు పోలీసులు. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు 040-27852482, 9490598985, 9010303626 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని పోలీసులు సూచించారు. అంతేకాదు.. గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.
గణేష్ నిమజ్జన యాత్ర గూగుల్ రూట్ మ్యాప్..
1. బాలాపూర్ నుండి వచ్చే శోభాయాత్ర, ఫలకనుమా నుంచి వచ్చే శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్‌టీఆర్ మార్గ్‌కు వినాయక విగ్రహాలను తరలించనున్నారు.
2. బేగం బజార్, ఉస్మాన్ గంజ్, అఫ్జల్గంజ్, గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు.
3. సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమాయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్‌టీఆర్ మార్గ్ వైపునకు విగ్రహాల మళ్లిస్తారు.
4. ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.
5. దిల్‌సుఖ్నగర్, ఐఎస్సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా సాగనుంది.

 

 

- Advertisement -

6. టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్‌టీఆర్మార్గ్వైపునకు మళ్లించనున్నారు.
మెహిదీపట్నం, తపచ్ బుత్రా, అసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే శోభయాత్ర సీతారాంబాగ్, బోయగుడ కమాన్, గోశామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి. ఈ రూట్ మ్యాప్‌లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు.
ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్‌టీఆర్మార్గ్‌కు చేరుకోనుంది. ఈ మార్గంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ప్రతి శోభాయాత్ర మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించించనున్నారు. విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ ఏర్పాటు చేశారు. బ్లూ, ఆరెంజ్, రెడ్, గ్రీన్ కేటాయించిన కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ట్రాఫిక్ పోలీసులు.

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Immersion traffic restrictions today .

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page