తెలంగాణలో 78 సీట్లు గెలవడం ఖాయం -మాణిక్యం ఠాగూర్

0 9,664

పరిగి ముచ్చట్లు:

 

నయా కాంగ్రెస్, నయా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రంలో రావాలని తెలంగాణ లో 78 సీట్లు గెలవడం ఖాయమని  టీపీసీసీ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్  అన్నారు. 2023 లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జండా ఎగరవేయడం జరుగుతుందని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని స్వాగత్ హోటల్లో  నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్ విస్త్రుత స్థాయి సమావేశానికి ముఖ్య అథిదిగా టీపీసీసీ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లు హాజరయ్యారు. అనంతరం మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు మరో 25 నెలలు మిగిలి ఉందని ఈ ఎన్నికల్లో విజయం సాధించే దీనంగా మనం పనిచేయాలి అని అన్నారు.రాష్ట్రంలో బిజెపి, టీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయని ,నిన్న రాష్ర్టానికి వచ్చిన అమిత్ షా గొప్పలు చెప్పి వెళ్లాడని అన్నారు. నూతన ఉత్సహాంతో రాష్ట్రం లో పనిచేసి 2023లో తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకుని రావాలని కచ్చితంగా 78 సీట్లు గెలిపించే విదంగా పనిచేయాలని ఈ సమావేశంలో ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని మరవద్దని తెలిపారు.తెలంగాణ సీఎం రాత్రి ఒక్కటి…పోద్దున్న ఇంక్కొటి మాట్లాడుతాడు అని అన్నారు. తన ఆస్తులు కాపాడుకునేందుకు డిల్లీ వెళ్లి వస్తారని అన్నాడు.కాంగ్రెస్ పాలనలో కులాల ప్రస్తావన లేకుండా పాలన సాగుతుందని ,ఇప్పుడు రాష్ట్రంలో కులాల పేరుతో రాజకీయం నడుస్తుంది అన్నారు.బూతు లేవల్ ,గ్రామలేవల్ ,మండల్ లేవల్  జిల్లా స్థాయి కమిటీలు కలిసి పనిచేయాలనేదే రాహుల్ గాంధీ ఉద్దేశమని అందరు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి ఆయన చేవెళ్ల పార్లమెంట్ లో ఉన్న అందరు నాయకులు పనిచేయాలని ఆయన కార్యకర్తలను  కోరారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Manikyam Tagore to win 78 seats in Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page