రాఖీ రచ్చ..రచ్చ

0 9,865

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

 

రాజకీయ ప్రయోజనాల కోసం రాఖీ సావంత్ పేరును వాడుకోవడం సరికాదంటూ ఆమె భర్త రితేష్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే‌పై మండిపడ్డారు. ఆ మేరకు ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, పంజాబ్ ఆప్ వ్యవహారాల్ కో-ఇంఛార్జి రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలకు రాఖీ సావంత్ భర్త గట్టి కౌంటర్ ఇచ్చారు. నవజ్యోత్ సింగ్ సిద్దూ‌.. పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అంటూ రాఘవ్ చద్దా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పరోక్షంగా పంజాబ్ రాజకీయాల్లో సిద్ధూ ఐటమ్ గర్ల్ అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిద్ధూను రాఖీ సావంత్‌తో పోల్చుతూ ఆప్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వివాదం రాజుకుంది. ఆప్ నేత వ్యాఖ్యలపై రాఖీ సావంత్ భర్త రితేష్ అభ్యంతరం వ్యక్తంచేశారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరుల వ్యక్తిగత జీవితాలను పాడుచేయొద్దన్నారు. ఈ విషయంలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జోక్యం చేసుకుని.. తమ పార్టీ ఎమ్మెల్యేని గాడిలో పెడితే మంచిదన్నారు.దీన్ని వార్నింగ్‌గా పరిగణించాలని మరోసారి తన భార్య పేరును మీ రాజకీయ వివాదంలోకి తీసుకొస్తే.. చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మరో ట్వీట్‌లో రాఖీ సావంత్ భర్త హెచ్చరించారు. ఇంకోసారి మీరు ఎన్నికల్లో విజయం సాధించకుండా చూస్తానంటూ ఆప్ ఎమ్మెల్యేని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత మీకు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతరుల పేర్లకు భంగం కలిగించే ఆ అధికారం మీకు ఎక్కడిదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Rakhi Rachcha..Rachcha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page