ఆరుగురు జీవిత ఖైదీల విడుదల

0 9,875

విశాఖపట్నం ముచ్చట్లు:

 

విశాఖపట్నం కేంద్ర కారాగారం నుండి ఇవాళ ఉదయం 11 గంటలకు ఆరుగురు జీవిత ఖైదీలు విడుదలయ్యారు. 2019 సంవత్సరంలో  కొంతమంది ఖైదీలు క్షమాభిక్షపై విడుదల అయ్యారు. ఆ సమయంలో ఈ ఆరుగురు ఖైదీలు కొన్ని కారణాల వల్ల క్షమాభిక్షకు నోచుకోలేదు. దీంతో  వీరు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి ఈ ఆరుగురు జీవిత ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. వీరు సుమారు 12 సంవత్సరాలు విశాఖ కేంద్ర కారాగారంలో సత్ప్రవర్తనతో జీవిత ఖైదు అనుభవించారు. శిక్ష కాలంలో వీరు కారాగారం లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలలో…  స్కిల్ డెవలప్మెంట్ యూనిట్లలో వివిధ రకాల పనులు నేర్చుకున్నారు. కారాగార పర్యవేక్షణ అధికారి ఎస్. రాహుల్  ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఆరుగురు జీవిత ఖైదీలను విడుదల చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags; Release of six life prisoners

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page