పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌ గోవిందరాజస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

0 9,869

తిరుపతి  ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో శ‌నివారం రాత్రి పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్నాయి.ఇందులో భాగంగా ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద‌యం 10.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, ప‌సుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు.అనంత‌రం సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌య ప్రాంగ‌ణంలో ఊరేగించ‌నున్నారు. ఆ త‌రువాత రాత్రి 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, ప్ర‌బంధ శాత్తుమొర‌, వేద శాత్తుమొర నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఉత్స‌వ‌మూర్తులు కుంభం విమాన‌ప్ర‌ద‌క్షిణంగా స‌న్నిధికి వేంచేపు చేస్తారు.ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌ స్వామి, ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు  పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు  వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఏఈవో  ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్  నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  కామ‌రాజు పాల్గొన్నారు.

- Advertisement -

టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

Tags; Sacred festivals of Sri Govindarajaswamy ending with Poornahuti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page