మంత్రివర్గం కోసం షోలు ఆపండి

0 9,662

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

వెన్నుపోటుదారు సంఘానికి ఉపాధ్యక్షుడినని తనను జోగి రమేష్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. తాను జగన్‌కు వెన్నుపోటు పొడిచానన్నారని.. తనను బతిమాలి పార్టీలో చేర్చుకున్నారన్నారు. పార్టీలో చేరిన మూడో రోజున గోకరాజు రంగరాజు అనే వ్యక్తిని పిలిచి.. ఇక డోర్ క్లోజ్ చేశానని.. పోటీ చేయమని చెప్పారా లేదో జగన్‌ను జోగి రమేష్ అడగాలన్నారు. తనను పార్టీలో చేర్చుకుని గోకరాజు రంగరాజుకు సీట్ ఆఫర్ చేశారా లేదా అడగాలన్నారు. ప్రశాంత్ కిషోర్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తే గతిలేక, గత్యంతరం లేక ఒప్పుకొన్నారన్నారు.ఆ ప్రశాంత్ కిషోర్ సీట్ ఇస్తే తాను వైసీపీ సింబల్ పై పోటీ చేసానన్నారు రఘురామ. తాను ఒక పార్టీ లో ఉండి ఉంటే ఇప్పుడు గెలిచిన దానికన్నా మూడు రెట్లు మెజారిటీ తో గెలిచేవాడినని.. తానేం చేశానో వాళ్ల నాయకుడ్ని అడుగాలన్నారు. తన ఫేస్‌తోనే గెలిచాను.. ఎవరి వలన తాను గెలవలేదన్నారు. నర్సాపురంలో జగన్‌ను పోటీ చేయమనండి.. తానూ పోటీ చేస్తానన్నారు. మై సన్ అంటే తట్టుకోలేని జోగి రమేష్.. లుచ్చా, వెదవ అని అసెంబ్లీలో ఎలా అన్నారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న పెద్ద మనిషి పులకించి.. రమేష్ మనసు దోచుకున్నావు.. కానీ తిట్టిన తర్వాత సారీ చెప్పడం భలే నచ్చిందని కితాబిచ్చారని సెటైర్లు పేల్చారు.అసెంబ్లీలో జోగి రమేష్ మాట్లాడిన మాటలతో అప్పుడే మంత్రి పదవికి చాలా చేరువయ్యారన్నారు ఎంపీ. అప్పటి ప్రతిపక్ష నేత అప్పటి ముఖ్యమంత్రిని తుపాకీతో కాల్చి చంపాలని, బంగాళాఖాతంలో కలపాలి అన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణ చెబితే.. వైసీపీ నేతలకు కూడా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ అడిగే హక్కు ఉంటుందన్నారు. మై సన్‌కే వైసీపీ నేతలు క్షమాపణ కోరితే.. చంద్రబాబును క్షమాపణలు చెప్పి..

 

 

- Advertisement -

ఆ తర్వాత అయ్యన్నాపాత్రుడ్ని క్షమాపణలు అడుగుదామన్నారు. ఈ దాడిని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసన్నారు.చర్చిలో ఫాదర్లు మై సన్ అంటారని.. మై సన్ అన్న దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి అయ్యన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారన్నారు రఘురామ. ఎవరో ఏదో చేస్తే దానికి రియాక్షన్‌లా జోగి రమేష్ అనే వ్యక్తి మంత్రి అవ్వాలనే పదవీ కాంక్షతో రగలిపోతున్నారన్నారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేస్తే.. సంబంధం లేని చంద్రబాబు ఇంటి మీదకు శాంతియుత దాడికి వెళ్లారా అంటూ సెటైర్లు పేల్చారు. 20 కార్లు వేసుకుని, రాళ్లతో శాంతియుతంగా ఇంటిపైకి వెళ్లారన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న, 14 ఏళ్లుముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేత ఇంటికి శాంతియుతంగా నిరసన తెలపడానికి అన్ని కార్లు, రాళ్లు ఎందుకో అని ప్రశ్నించారు.కరోనా తీవ్రత తగ్గడంతో తిరుమలకు ఎంతోమంది భక్తులు వస్తున్నారన్నారు నర్సాపురం ఎంపీ. చిత్తూరు జిల్లా వాళ్లకు సర్వ దర్శనం టోకెన్లు ఇస్తున్నారని.. పాలకమండలిలో మాత్రం విశ్వవ్యాప్తం అంటారు.. అన్ని రాష్ట్రాల నుంచి సభ్యుల్ని నియమించారన్నారు. మరి సర్వదర్శనం టికెట్లు మాత్రం చిత్తూరు జిల్లావాళ్లకు మాత్రమే ఇస్తారా అని ప్రశ్నించారు. టీటీడీ పాలకమండలి నియామకంపై సోమ, మంగళవారాల్లో కోర్టులో పిటిషన్ వేస్తానని.. దేవుడి దయతో కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని.. న్యాయస్థానంలో కూడా న్యాయం జరగకపోతే దేవుడే న్యాయం చేస్తారన్నారు.

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Stop shows for the cabinet

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page