వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

0 8,221

తిరుప‌తి ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శ‌నివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, అగ్నిప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.మధ్యాహ్నం 2 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.ఈ కార్యక్రమంలో  ఆలయ డెప్యూటీ ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు  బాబుస్వామి, సూపరింటెండెంట్‌ మధు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రాజేష్ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో అక్టోబర్‌ 2న ఉద్యోగులు ఛలో విజయవాడ

 

Tags: The holy festivals begin at the glorious Sri Padmavati Ammavari Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page