నిఘా నీడలో వినాయక నిమజ్జన శోభాయాత్ర, ఏలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత

0 9,697

-నిమజ్జన ప్రాంతాలలో గజ ఈతగాళ్లు, పోలీసుల భద్రత
-నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

 

రామగుండం ముచ్చట్లు:

 

- Advertisement -

గణేష్ నిమజ్జన శోభాయాత్ర పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని రామగుండము పోలీస్ కమీషనర్  ఎస్.చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలందరు ఆనందంగా  శోభయాత్రలో పాల్గొనడానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసామని అన్నారు.ప్రజలు ఏలాంటి  పుకార్ల  ను నమ్మరాదు. అవసరం అనుకుంటే దగ్గరలోని సిబ్బంది గాని పోలీస్ స్టేషన్ గాని సమాచారం అందించగలరు. సామాజిక మాధ్యమంల్లో వచ్చే పద్ధతులను నమ్మకండి. శోభయాత్ర జరిగే ప్రాంతాలలో యాత్ర జరిగేటప్పుడు ట్రాఫిక్ డైవెర్షన్ ఉంటాయి. కాబట్టి ప్రజలు దానికి అనుకూలంగా సిద్ధం కావాలి. మద్యం త్రాగి వాహనాలను నడుపరాదు. మద్యం త్రాగి గణేష్ వాహానాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసికుంటామని అ్నారు. డి.జె లకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదు. టపాకాయలు కాల్చరాదు. . గణేష్ మండపాల నిర్వహకులంతా మంచి కండిషన్ లో ఉన్న వాహనాలను మాత్రమే శోభాయాత్రకు వినియోగించాలని సూచించారు. ఆధ్యాత్మిక వాతావరణం చక్కగా కనిపించే విధంగా చూడాలని, మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దని చెప్పారు. నిమజ్జన ప్రాంతాలలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని అయితే మండపాల నిర్వాహకులు చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని సూచించారు. నిర్దేశించిన విదంగా క్రమపద్ధతిలో శోభాయాత్రలో పాల్గొనాలని పోలీస్ శాఖ సూచనలు పాటించాలని కోరారు.

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Vinayaka immersion procession in the shadow of surveillance, fortified security to prevent any incidents

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page