శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

0 9,007

తిరుపతి ముచ్చట్లు:

శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు. ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వ‌ర‌కు పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.కాగా, సాయంత్ర 6.00 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించనున్నారు.ఈ కార్యక్రమంలో జెఈఓ సదా భార్గవి, ఆలయ డెప్యూటీ ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు బాబుస్వామి, సూపరింటెండెంట్‌  మ‌ధు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రాజేష్ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Scientifically sacred offering at Sri Padmavati Ammavari Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page