లోకేష్ మెడకు ఫైబర్ నెట్ స్కామ్

0 8,576

విజయవాడ ముచ్చట్లు:

 

ఫైబర్ నెట్ కుంభకోణం తెలుగుదేశం పార్టీ అగ్రనేతలకు ఇబ్బంది పెట్టేలా కన్పిస్తుంది. ప్రధానంగా నారా లోకేష్ టార్గెట్ గానే ఈ కేసు ముందుకు నడుస్తున్నట్లు అనుమానాలున్నాయి. ఫైబర్ నెట్ కేసులో ఇప్పటికే అప్పటి ఎండీ సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తర్వాత అరెస్ట్ ఎవరన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో తొలుత 19 మందిపై సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.ఫైబర్ నెట్ మాజీ ఎండీ సాంబశివరావు అరెస్ట్ తో టీడీపీలో కొంత బెరుకు మొదలయింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఫైబర్ నెట్ ప్రాజెక్టును అమలులోకి తెచ్చింది. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను ఖరారు చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో 330 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. రెండు వేల కోట్ల విలువైన టెండర్ల మొదటి దశలోనే అవకతవకలు జరిగినట్లు చెబుతున్నారు.ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాత్ర ఉందన్నది వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

 

 

- Advertisement -

ప్రస్తుతం జైలు పాలయిన సాంబశివరావు పై లోకేష్ వత్తిడి తెచ్చి టెండర్లను ఆమోదించినట్లు విమర్శలున్నాయి. టెండర్ల గడువును పొడిగించడమే కాకుండా, ఫేక్ ఎక్సీపిరియన్స్ సర్టిఫికేట్ ను సయితం ఆమోదించి టెండర్లను టెరాసాఫ్ట్ కంపెనీకి ఖరారు చేశారంటున్నారు.ఫైబర్ నెట్ కేసులో మరికొన్ని అరెస్ట్ లు ఉంటాయంటున్నారు. ఇందులో నారా లోకేష్ పాత్రపై ఆధారాలను సీఐడీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. లోకేష్ విషయంలో స్పష్టమైన ఆధారాలను లభిస్తే ఆయన పేరు కేసులో ప్రధానంగా చేర్చే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం ఈ కేసులో నిందితులను సీఐడీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. మొత్తం మీద రానున్న కాలంలో ఫైబర్ నెట్ కుంభకోణం ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటు టీడీపీని కూడా కుదిపేసే అవకాశముంది.

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Lokesh neck fiber net scam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page