పట్టపగలే భారీ చోరీ…

0 9,697

-35 తులాల బంగారం,5 తులాల వెండి,ఆరు లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

 

అనంతపురం ముచ్చట్లు:

 

- Advertisement -

అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజక వర్గ పరిధిలోని ఓబులదేవరచెరువు మండలం గాజుకుంటపల్లిలో పట్టపగలే  భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి  35 తులాల బంగారం,5 తులాల వెండి, ఆరు లక్షల నగదు ఎత్తుకెళ్లారు. స్థానికంగా నివాసం ఉంటున్న అంగన్వాడీ వర్కర్ విమల,రఘు దంపతులు ఇంటి స్థలం కొనుగోలుకు సంబంధించి నగదును తీసుకొచ్చి ఇంట్లో ఉంచారు.ఈ క్రమంలో కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో వైద్యం చేయించేందుకు తీసుకెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు పట్టపగలే చోరికి పాల్పడ్డారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి 35తులాల బంగారం, 5 తులాల వెండి, ఆరు లక్షల నగదు ఎత్తుకెళ్లారు.పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై గోపి కేసు నమోదు చేసి ఎస్ఐ సమక్షంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఎప్పుడు చోరీ చేశారు ఎంత మంది చోరిలో పాల్గొన్నారు అనే దానిపై బాధితులను అడిగి తెలుసుకున్నారు.

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Massive theft on graduation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page