మెట్రో ఎప్పుడు…

0 9,692

విశాఖపట్టణం  ముచ్చట్లు:

 

ఏపీ ఏర్పడి దాదాపు ఏడేళ్లన్నరేళ్లు కావస్తోంది. విభజన హామీలో భాగంగా విశాఖకు రైల్వే జోన్ తోపాటు మైట్రో ట్రైన్ ప్రాజెక్టు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఏపీకి మెట్రో ట్రైన్ ప్రాజెక్టు మంజూరు కాకపోవడం శోచనీయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కు మాత్రమే మెట్రో రైలు ప్రాజెక్టును అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. టీఆర్ఎస్ సర్కారు హయాంలో మెట్రో ట్రైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్లో కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి. ఈ సదుపాయం వల్ల నగరవాసులకు రవాణా విషయంలో చాలా ఊరట కలిగిందని చెప్పొచ్చు.నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కనీసం రాజధాని సైతం నిర్మించలేక పోయారు. ఇక ప్రతిష్టాత్మకమైన మైట్రో ట్రైన్ ప్రాజెక్టును ఏకంగా గాలికొదిలేశారు. దీంతో ఏపీకి మైట్రో ట్రైన్స్ సదుపాయం లేకుండా పోయింది. రోజురోజుకు పెరిగిపోతున్న నగర జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ కష్టాలను దూరం చేసేందుకు కేంద్రం మైట్రో రైళ్ల ప్రాజెక్టులను అన్ని రాష్ట్రాలకు కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఏపీకి మాత్రం మెట్రో ప్రాజెక్టు విషయంలో బీజేపీ సర్కారు మొండిచేయి చూపిస్తుంది.దేశంలోని ఈశాన్య, కేంద్ర ప్రాంతాలు మినహాయిస్తే అన్ని రాష్ట్రాల్లో మైట్రో రైళ్ల వ్యవస్థ అందుబాటులో ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి మైట్రో రైల్ వ్యవస్థ గుండెకాయగా మారింది. అక్కడ మరింత రైళ్ల నెట్ వర్క్ ను ప్రభుత్వం విస్తరిస్తోంది. తాజాగా నజఫ్ గడ్ నుంచి దౌసా బస్టాండ్ వరకు నిర్మించిన మెట్రో రైల్వే అందుబాటులోకి వచ్చింది. దీనిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తాజాగా ప్రారంభించారు.

 

 

 

- Advertisement -

కాగా కేంద్రం 2022 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 900 కిలోమటర్ల మేరకు మెట్రో రైల్ ప్రాజెక్టును వేర్వేరు రాష్ట్రాలకు మంజూరు చేసింది.వీటిలో 740 కిలోమీటర్ల మేరకు మైట్రో రైలు ప్రాజెక్టు పనులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది మంజూరు కాబోయే 900 కిలోమీటర్లను మైట్రో రైల్వే విస్తరణను పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా 2వేల కిలోమీటర్ల మైట్రో రహదారి అందుబాటులో రానుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతీయేటా కేంద్రం కొత్త మెట్రో ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. అయితే ఏపీకి మాత్రం ఇప్పటి కూడా ఒక్క మెట్రో ప్రాజెక్టు కూడా మంజూరు చేయకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో మెట్రో ట్రైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురంలో మెట్రో ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. ఇవన్నీ కూడా ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. కానీ దక్షిణాదిలో మెట్రో ట్రైన్ లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుంది. నవ్యాంధ్రకు మెట్రో ట్రైన్ ప్రాజెక్టు సాధించడంలో గత టీడీపీ సర్కారు ఘోరంగా విఫలమైంది.అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలోనైనా ఏపీకి మెట్రో ప్రాజెక్టును తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించాలని అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Metro when …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page