తిరుమల పాలకమండలి సభ్యుడిగా మొరంశెట్టి ప్రమాణస్వీకారం

0 9,869

తిరుమల ముచ్చట్లు:

 

టిటిడి పాలక మండలి సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం తరపున మొరంశెట్టి రాములు ప్రమాణస్వీకారం చేశారు.. ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్ సన్నిధిలో మొరంశెట్టి రాములు చేత టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన టిటిడి పాలక మండలి సభ్యుడు మొరంశెట్టి రాములు మీడియాతో మాట్లాడుతూ..  రెండోవ సారి టిటిడి పాలక మండలి సభ్యులుగా అవకాశం  దక్కడం నా పూర్వజన్మ సుకృతంమన్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి నా చర్మంతో చొప్పులు కుట్టించినా తక్కువేనని,పాలక మండలిలో చోటు కల్పించిన ఇరురాష్ట్రాల సీఎంలకు మనస్సు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసారు.. బంగారు తెలంగాణా కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కి శ్రీవారి ఆశీస్సుకు ఉండాలి ప్రార్ధించినట్లు తెలిపారు.. మాతృశ్రీ వకుళామాత దేవాలయం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు..టిటిడి పాలక మండలి సభ్యుల పెంపు విషయం ఏపి సీఎం తీసుకున్న నిర్ణయం మంచిదేనని, పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పాలక మండలి సభ్యులను పెంచడం మంచి పరిణామమేని మొరంశెట్టి రాములు అన్నారు..

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

 

Tags: Moransetti sworn in as a member of the Tirumala Governing Body

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page