సందీప్ కిషన్, వీఐ ఆనంద్, అనిల్ సుంకర, హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం

0 9,692

– అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్

 

హైదరాబాద్‌ ముచ్చట్లు:

- Advertisement -

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వినూత్న కాన్సెప్ట్‌లతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు వీఐ ఆనంద్‌తో క‌లిసి సందీప్ కిషన్ మ‌రో  ప్రాజెక్ట్ చేయబోతోన్నారు.  స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై  ప్రొడక్షన్ నెంబర్ 1గా  రాజేష్ దండా  నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి  అల్లరి నరేష్ క్లాప్ కొట్టారు. నాగ శౌర్య కెమెరా స్విచ్చాన్ చేశారు. జెమినీ కిరణ్, నిర్మాత సుధీర్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. నాంది మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్ హిట్ మూవీ దియా ఫేమ్ ఖుషీ రవి, ఏక్ మినీ కథ ఫేమ్ కావ్యా థాపర్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శేఖర్  చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. కెమెరామెన్‌గా సిద్, ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్ బాధ్యతలు నిర్వహించనున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత‌. భాను భొగవరపు, నందు సావిరిగన ఈ మూవీకి మాటలు అందిస్తున్నారు. అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.నటీనటులు: సందీప్ కిషన్, కావ్యా థాపర్, ఖుషీ రవి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, ప్రవీణ్ బెల్లంకొండ తదితరులు

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Sandeep Kishan, VI Anand, Anil Sunkara, Comedy Movies Production No. 1 begins with worship programs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page