విక్ట‌రీ వెంక‌టేష్ ఆవిష్క‌రించిన `ఇదే మా కథ` కాన్సెప్ట్ టీజ‌ర్‌…

0 9,257

హైదరాబాద్‌ ముచ్చట్లు:

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన రోడ్ జర్నీ చిత్రం ‘ఇదే మా కథ’. గురు పవన్ దర్శకత్వం వహించారు. శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.   టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ టీజ‌ర్‌ను విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇదే మా క‌థ టీజ‌ర్ చాలా బాగుంద‌ని ఇలాంటి కొత్త త‌ర‌హా చిత్రాలు మ‌రిన్ని రావాల‌ని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ, వారిలో చాలా మంది జీవించడంలో విఫలమవుతుంటారు. బైక్‌ల‌పై సాధారణ భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్న వివిధ వయసులకు సంబంధించిన నలుగురి అపరిచితుల కథ ఇది. వీరంతా వారి జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఏం తెలుసుకున్నారనేది? ఈ చిత్ర కథ.ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది, ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఈ చిత్రాన్ని Ap & TG లో విడుద‌ల‌చేయ‌నుంది.  ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, జునైద్ సిద్దిఖీ ఎడిటర్.న‌టీన‌టులు: సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్, పృధ్వీ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సప్తగిరి, జబర్దస్త్ రామ్ ప్రసాద్, త్రివిక్రమ్ సాయి, శ్రీజిత ఘోష్ తదితరులు

- Advertisement -

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: The concept teaser of ‘Ide Maa Katha’ launched by Victory Venkatesh …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page