కాసుల నేతల కోసం వెయిటింగ్

0 9,694

గుంటూరు ముచ్చట్లు:

 

ఏ పార్టీ కైనా విపక్షంలో ఉంటూ నెట్టుకు రావడం నేటి డబ్బుతో కూడిన రాజకీయాల్లో బాగా కష్టమైన పని. అందుకే అన్ని పార్టీలు ఆర్ధిక పరిపుష్టి బాగా ఉన్న వారిని ఎంచుకుని వారికి నాయకత్వ బాధ్యతలతో పాటు ఎంపీ ఎమ్యెల్యేల టికెట్లు కట్టబెడుతూ వస్తుంటాయి. అధికారంలోకి రాకుండా పార్టీ నిర్వహణ ఖర్చును భరించడం కష్టం అనే భావనతోనే ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి ముందు చూపుతో మూసేశారని రాజకీయ నిపుణులు చెబుతారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం పెద్దగా పార్టీ యంత్రాంగం లేకుండా వన్ మెన్ ఆర్మీగా 2014 నుంచి పార్టీని నెట్టుకొస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత జనసేన ను విస్తరించే పని పెట్టుకున్నా ఆర్ధికంగా పార్టీ ఎక్కడివారు అక్కడి ఖర్చులు భరించక తప్పదన్న ఫార్ములాలోనే సాగుతుంది.ప్రస్తుతం ఏపీ లో ఉన్న అధికార వైసీపీ దెబ్బకు విపక్షాలన్నీ పూర్తిగా కుదేలయిపోయాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షానికి చాలా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ అనుకున్న వారు సైతం జేబులోనుంచి రూపాయి ఖర్చు చేయడం లేదని క్యాడర్ వాపోతుంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఆర్ధికంగా బలంగా ఉన్న వారే టీడీపీ లో ఇంకా కొనసాగుతున్నారు. వీరంతా ఎన్నికల ముందు గాలి ని బట్టి చూసుకుందామనే ధోరణి తో కొనసాగుతున్నారని తెలుస్తుంది. ఎప్పుడో పెదబాబు, చినబాబు వచ్చినప్పుడు తప్ప ఖర్చు చేయడానికి వారికి ధైర్యం చాలడం లేదని టాక్.గత టీడీపీ ప్రభుత్వంలో కోట్ల రూపాయలు కూడగట్టుకున్నా కూడా పార్టీ కష్టకాలంలో ఎవరు ముందుకు రాకపోవడం అధినాయకత్వాన్ని సైతం కలవరపెడుతుంది. ఇదే పరిస్థితి ఇక ముందు కొనసాగి టీడీపీ నేతలు ఆ విధంగానే ముందుకు వెళితే మరింత క్యాడర్ అధికారపక్షంలోకి జంప్ కావడం ఖాయమనే అంటున్నారు అంతా. కరోనా పేరు చెప్పి జనంలోకి రాకుండా కార్యక్రమాలకు ప్రస్తుతం దూరం జరిగినా వచ్చే రెండున్నరేళ్ళు రాజకీయాల్లో జోరు పెంచకపోతే పార్టీకి కష్టమే దాపురిస్తుందని పసుపు దళంలో ఆందోళన మరింతగా పెరుగుతుంది. మరి దీన్ని చంద్రబాబు ఎలా సరిదిద్దుతారో చూడాలి.

 

 

 

- Advertisement -

పరిషత్ ఫలితాలతో తమ్ముళ్లలో నిరాశ రాజకీయాల్లో సమర్థనలు ఎప్పుడూ చెల్లవు. తాము తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే సమయంలో చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు పిలుపు నిచ్చారు. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకూ పోటీకి దిగిన చంద్రబాబు ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో ఎన్నికలను బహిష్కరించారు. ఏకగ్రీవాలను సాకుగా చూపి, బెదిరింపులకు దిగారని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటారు.అయితే అనేక చోట్ల పోటీకి ఎవరూ దొరకకపోవడంతోనే బహిష్కరణకు పిలుపునిచ్చారన్న విమర్శలున్నాయి. టీడీపీ నేతలు అనేక చోట్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడం కారణంగా పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదన్నది కూడా వాస్తవమే. దీనికి తోడు పార్టీ నిధులు ఇవ్వాలన్న వత్తిడి కూడా చంద్రబాబు బహిష‌్కరణకు కారణమని అనే వారు కూడా లేకపోలేదు.

 

 

 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి నిధుల విడుదల చేయలేక చేతులెత్తేశారని చెబుతారు.ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. దీంతో టీడీపీ శ్రేణుల్లో నీరసం కన్పిస్తుంది. ఎక్కడా టీడీపీ నేతలు ఇళ్లు వదలి బయటకు రాలేదు. కౌంటింగ్ లో తాము పోటీ చేయకపోవడంతో వాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి బలి కావాల్సి వచ్చిందని మదన పడుతున్నారు. నిజానికి కొందరు బలమైన నేతలే ఉన్నారు. వారిని కొంత ఆర్థికంగా ఎన్నికల్లో ఆదుకుంటే సానుకూల ఫలితాలు వచ్చేవి.కాని చంద్రబాబు మాత్రం నిధుల వ్యయానికి భయపడే ఈ ఎన్నికలను బహిష‌్కరించారన్నది పార్టీలో బలంగా వినిపిస్తుంది. మరో ఐదేళ్ల పాటు తమకు రాజకీయ అవకాశాలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలు విలువలేవని టీడీపీ అగ్రనేతలు కొట్టిపారేస్తున్నా ఈ ఫలితాలు వస్తుండటంతో పార్టీ కింది స్థాయి నేతల్లో నైరాశ్యం అలుముకుందని సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కొందరి రాజకీయ జీవితాన్ని ఐదేళ్లు వెనక్కు నెట్టిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

పుంగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Tags: Waiting for cash leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page