కొంప ముంచుతున్న కొత్త రకం విత్తనాలు

0 9,868

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

శ్రీకాకుళం జిల్లాకు ఈ ఏడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం కొత్తగా పరిచయం చేసిన ఎంటిఆర్‌ 1156  రకం విత్తనాలు కొందరు రైతులను నిలువునా ముంచాయి. చీడపీడలను తట్టుకుంటుందంటూ, దిగుబడి ఎక్కువ వస్తుందంటూ వ్యవసాయ శాఖాధికారులు ప్రచారం చేశారు. దీనిని నమ్మి ఈ రకం విత్తనాలను వేసిన అన్నదాతలకు మొదటికే మోసం వచ్చింది. గత ఖరీఫ్‌ ప్రారంభంలో ప్రభుత్వం 1001 రకం విత్తనాలను నిలుపుదల చేసింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా 1156 రకం విత్తనాలను వేసుకోవాలని రైతులకు వ్యవసాయ శాఖాధికారులు సూచించారు. కొత్త రకం విత్తనాలు వేసిన 45 రోజుల్లోనే వెన్ను దశకొచ్చి పంట అసంపూర్ణంగా కనిపిస్తోంది. ఒక్కో వరి దుబ్బులో పది వరకు పిలకలు వేసి, వెన్ను రావాల్సిన స్థానంలో రెండేసి పిలకలు వచ్చాయి. కోటబొమ్మాళి, టెక్కలి మండలాల్లో ఈ పరిస్థితితో రైతుల గుండె తరుక్కుపోతోంది. జిల్లాకు పుష్యమి విత్తనాలను 500 క్వింటాళ్ల వరకూ ప్రభుత్వం కేటాయించింది. ఇవి కాకుండా ప్రయివేట్‌ డీలర్ల వద్ద కూడా రైతులు ఈ రకం విత్తనాలను కొనుగోలు చేశారు. మొత్తం 2,700 ఎకరాల్లో విత్తనాలను వేసినట్లు సమాచారం. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి పొలాలను పరిశీలిస్తారని అధికారులు చెప్పినా, వారు రాకపోవడంతో రైతులు దిక్కతోచని స్థితిలో ఉన్నారు. కోటబొమ్మాళి మండలంలో పుష్యమి రకం విత్తనాలు వేసి నష్టపోయిన రైతుల్లో కొందరు కొత్తగా మరో రకం వరి విత్తనాలు వేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: New type of seeds dipping perch

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page