మధురపూడి విమానశ్రయంపై స్మగ్లర్ల కన్ను

0 9,692

కాకినాడ ముచ్చట్లు:

 

తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయంపై స్లగ్లర్లు కన్నేశారు. ఈ విమానాశ్రయానికి కొందరు గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లర్లు బంగారాన్ని రవాణా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మాదిరిగా ఇక్కడ పూర్తిస్థాయిలో కస్టమ్స్‌ అధికారులు లేకపోవడంతో స్మగ్లర్లు ఈ ఎయిర్‌పోర్టును రాచమార్గంగా ఎంచుకున్నారు. స్మగ్లర్లు ఈ విమానాశ్రయాన్నే ఎందుకు ఎంచుకున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.ఎయిర్‌పోర్టుకు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న బంగారం అక్రమ రవాణాను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌  అధికారులు బట్టబయలు చేశారు. ఈనెల 16న కొలంబో నుంచి హైదరాబాద్‌కు 1,900 గ్రాముల బంగారాన్ని ముద్దచేసి లోదుస్తుల్లో తరలిస్తుండగా విమానాశ్రయంలో డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. దీంతో బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారం వెలుగుచూసింది. ఈ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌, మెటల్‌ డిటెక్టర్లతో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారు. అయినప్పటికీ బంగారం స్మగ్లింగ్‌ జరుగుతోంది. ఇక్కడ బ్యాగేజీ యంత్రాలు ఉన్నాయి. లగేజీల్లో దాచిన బంగారం, డబ్బు స్క్రీన్‌లో కన్పిస్తాయి.

 

 

 

- Advertisement -

స్మగ్లర్లు లోదుస్తుల్లో బంగారాన్ని తరలిస్తుండటంతో అక్కడ దాచిన బంగారాన్ని పట్టుకునే సాంకేతికత లేకపోవడంతో సులువుగా తప్పించుకుంటున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మాదిరిగా ఇక్కడ కస్టమ్స్‌ అధికారులు లేకపోవడంతో స్మగ్లర్లు ఈ విమానాశ్రయాన్ని స్మగ్లింగ్‌కు ఎంచుకున్నట్లు తెలిసింది. డిఆర్‌ఐ అధికారులకు ముందస్తు సమాచారం రావడంతో ఈ స్మగ్లర్‌ను పట్టుకోగలిగారు. సమాచారం లేకపోతే మరికొంతకాలం స్మగ్లర్లు యథేచ్ఛగా ఈ విమానాశ్రయం ద్వారా బంగారాన్ని తరలించుకుపోయేవారు. ఈ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ మీదుగా ముంబై, చెన్నై, కోల్‌కత్తా, దుబాయి, సింగపూర్‌ తదితర ప్రాంతాలకు కనెక్టివిటీ ద్వారా రాకపోకలు సాగుతుండటం స్మగ్లర్లకు కలిసివచ్చింది. ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు పూర్తిస్థాయిలో ఉండాలని పలువురు కోరుతున్నారు.

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Smugglers’ eye on Madurai airport

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page