అంగన్ వాడీల కోసం ప్రత్యేక నర్సీరీలు

0 9,263

కడప ముచ్చట్లు:

 

కడప జిల్లాలో ప్రతి పంచాయతీలో న్యూట్రిషియన్‌ గార్డెన్లను ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ బాధ్యతను పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథక, స్త్రీ శిశు సంక్షేమశాఖకు ప్రభుత్వం అప్పగించింది. వీటి ఏర్పాటుకు ఈ శాఖలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని న్యూట్రిషియన్‌ గార్డెన్ల కోసం పంచాయతీల పరిధిలో 20 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఉపాధి హామీ అధికారులకు అప్పగించాలని తహసీల్దార్లకు స్పష్టం చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమశాఖకు అప్పగించారు. మెనూ ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించాలి. న్యూట్రిషియన్‌ గార్డెన్ల ఏర్పాటు అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఓ పక్క ఉన్నతాధికారుల ఒత్తిడి, మరోపక్క క్షేత్ర స్థాయిలో స్థలాల కొరత అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే మంజూరైన అంగన్‌వాడీ కేంద్రాలకు కొన్ని గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం కూడా లభించక వాటి నిర్మాణ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.కూరగాయల ఖర్చులు, సరుకులకు ప్రభుత్వమే నిధులను విడుదల చేస్తోంది. అయితే ఈ ఖర్చును తగ్గించుకునేందుకు ఆయా గ్రామాలలో 10 నుంచి 20 సెంట్ల స్థలాన్ని కేటాయించి, అక్కడ కూరగాయలు పండించాలి. అయితే ఒక్క గ్రామంలో కూడా దీనికి అవసరమైన ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేవు. దాతల నుంచి స్థలాన్ని సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.ఈ స్థలాల గుర్తింపులో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టి ఇప్పటివరకు 465 చోట్ల గుర్తించారు. జిల్లాలో మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు 3,268, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 353 కలిపి మొత్తం 3,621 ఉన్నాయి. ఇందులో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు 1,05,711 మంది, మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలలోపు 96,570 మంది పిల్లలున్నారు. గర్భిణులు 2,321, బాలింతలు 22,174 మంది  ఉన్నారు. వీరందరికీ పౌష్టికాహారం అందించడానికి ప్రతినెల 35,48,222 కోడిగుడ్లు అందిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: Special nurseries for Anganwadis

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page