కీలక నిర్ణయం తీసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

0 9,293

విజయవాడ ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మండలంలో అయిన ZPTC,MPP రెండూ స్థానాలు అన్-రిజర్వుడ్ అయినచో ఒక స్థానాన్ని BC,SC,ST లకు కేటాయించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50% బిసి,ఎస్సి,ఎస్టీలకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇపుడు ZPTC,MPP లలో ఓ స్థానాన్ని BC,SC,ST లకు ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేలకు సూచించారు.ఇప్పటికే ZPTC,MPTC ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి .రాష్ట్రంలో చాలా ZPTC స్థానాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.ఈ నెల 25న MPP ని ఎన్నుకోవాల్సి ఉంది.ఈ క్రమంలో ఏకగ్రీవం అయిన ZPTC స్థానాన్ని ఇపుడు మార్చేందుకు వీలులేదు.MPP అభ్యర్థిని మార్చేందుకు ఆస్కారం ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏ మండలంలో ZPTC,MPP రెండూ అన్-రిజెర్వుడ్ ఉన్న చోట్ల MPP ని BC,SC,STలకు కట్టబెట్టబోతోంది వైసిపి.ఈ నిర్ణయం పట్ల పలువురు ఎస్సి,ఎస్టీ,బిసి సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ,హర్షం వ్యక్తం చేశారు.జగన్ మోహన్ రెడ్డి  తీసుకుంటున్న చారిత్మక నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనప్పటికి ఎంపీపీ,జెడ్పిటిసి రెండు అన్-రిజర్వయిడ్ అయినా మండలాలలో ఎంపిపి పదవిని బిసి,యస్సి,ఎస్టీ వర్గాల వారికి కట్టబెట్టాలని పార్టీ అధినేత గట్టిగా ఆదేశాలు జారీ చేసారు.రాష్ట్రంలోని అందరూ ఎమ్మెల్యేలు,సమన్వయ కర్తలు ఈ విధానాన్ని పాటించాలని తెలిపారు.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags: The key decision was taken by the YSR Congress Party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page