పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

0 9,840

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయల వ్యవస్థ పారదర్శకంగా, ఆదర్శవంతంగా ఉండాలని ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కోరారు. మంగళవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, జెడ్పిమాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి తో కలసి 16 వార్డు సచివాలయాల ఉద్యోగులు , అధికారులు, కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయాల వారిగా లబ్ధిదారులు, అనర్హుల జాబితాలు, అందిస్తున్న సేవలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సచివాలయంలోను ఆయా పరిధిలోని కుటుంబ వివరాలు నమోదు చేయాలని, దీనికి సంబంధించి వారికి అందుతున్న పథకాలతో పాటు రికార్డులు సిద్దం చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన డేటా అందుబాటులో ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆయా ప్రాంత కౌన్సిలర్లు , సచివాలయ ఉద్యోగులతో కలసి పర్యటించి, సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పుంగనూరు నియోజకవర్గం ఆదర్శవంతంగా ఉండేలా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, సీఐ గంగిరెడ్డి, పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, జయరామిరెడ్డి, ఇఫ్తికార్‌, అమ్ము, కిజర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కమిటి చైర్మన్‌గా డాక్టర్‌ శరణ్‌కుమార్‌

Tags: The performance of Punganur secretariats should be ideal – MLA Dwarakanathareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page