మహిళకు రక్తదానం చేసిన యువకుడు

0 4,483

కామారెడ్డి  ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గంలో సదాశివనగర్ మండలం తుక్కోజి వాడి గ్రామానికి  చెందిన రాణి (35)అనే గర్భిణికి  మైత్రి వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ‘బి’నెగిటివ్ రక్తం అవసరం పడింది. మహిళ బంధువులు బాలు ను సంప్రదించారు.  చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేష్ ను పిలిపించారు. ఆయన మానవతా దృక్పథంతో రక్తదానం చేసి గర్భిణి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ,  గత 13 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్నవారికి రక్తం అవసరం అయినప్పుడు ఎల్లవేళలా కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా సహకరిస్తామని, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినట్లయితే చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చుని అన్నారు. రక్తదానం వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చునని, రక్తదానం చేయాలనుకున్నవారు
9492874006 కి సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్, లక్ష్మణ్, రాజు, వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్ పాల్గొనడం జరిగింది.

- Advertisement -

పుంగనూరు సచివాలయల పనితీరు ఆదర్శంగా ఉండాలి – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Tags:A young man who donated blood to a woman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page